
వైఎస్సార్ జిల్లా: బద్వేలు శాసన సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు మరో వైద్యురాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలో ఇద్దరు వైద్యులు ఈ శాసనసభకు, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఎంఎస్ జనరల్ సర్జన్ చదివిన డాక్టర్ శివరామక్రిష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి పర్యాయం 1978లో జనతాపార్టీ తరపున 10,187 ఓట్లతో, రెండో పర్యాయం కాంగ్రెస్ తరపున 10,001 మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా 44,7354 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఈయన ఎంబీబీఎస్,ఎంఎస్ ఆర్థోపెడిక్ చదివారు. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ సుధా పోటీలో ఉన్నారు. ఈమె ఎంబీబీఎస్ చదివి గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు.
డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ సుధ భార్యభర్తలు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రస్తుత.. ఉప ఎన్నికలో ఆయన భార్య సుధా నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీచేయమని ప్రకటించాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం సుధ ఎన్నిక కావడం లాంఛనమే కానుంది.
చదవండి: Badvel bypoll: బద్వేలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్