
సాక్షి, వైఎస్సార్ కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్ కానుక అందించారు. బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు.