ఇంట్లో నుంచి కాలు కదపకుండా అన్ని పనులు ఆన్‌లైన్‌లో చేసకోవడం చాలామందికి అలవాటైపోయింది. కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో ఆన్‌లైన్ ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనిని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్ల దొరికినంత దోచేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. వస్తువు మన చేతిలోకి చేరే వరకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ క్రమంలో కడప జిల్లాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఆన్‌లైన్ మోసానికి అద్దం పడుతోంది.
బద్వేలుకు చెందిన ప్రదీప్ ఓ వ్యక్తి అమెజాన్‌లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ అవసరమై బుక్ చేశారు. సిద్దవటం రోడ్డులోని సర్వీసు సెంటర్‌కు మంగళవారం పార్సిల్ వచ్చింది. అతడు రూ.3,099 డబ్బు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అయితే పార్సిల్‌పై ఎందుకో అనుమానం రావడంతో దాన్ని ఓపెన్ చేస్తూ వీడియో తీశాడు. చివరికి అందులో హార్డ్ డిస్క్ లేకపోవడంతో షాకయ్యాడు. అందులో పది రూపాయలవి రెండు బట్టల సబ్బులు ఉండటాన్ని చూసి దిమ్మ తిరిగింది. హార్డ్ డిస్క్‌కు బదులు సబ్బులు పంపించారని.. చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరారు. తమకు సంబంధంలేదని అమెజాన్ డెలివరీ బాయ్ చేతులెత్తేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
చదవండి: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment