online orders frauds
-
అమెజాన్‌లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్!
ఇంట్లో నుంచి కాలు కదపకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసకోవడం చాలామందికి అలవాటైపోయింది. కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనిని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్ల దొరికినంత దోచేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. వస్తువు మన చేతిలోకి చేరే వరకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ క్రమంలో కడప జిల్లాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఆన్లైన్ మోసానికి అద్దం పడుతోంది. బద్వేలుకు చెందిన ప్రదీప్ ఓ వ్యక్తి అమెజాన్‌లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ అవసరమై బుక్ చేశారు. సిద్దవటం రోడ్డులోని సర్వీసు సెంటర్‌కు మంగళవారం పార్సిల్ వచ్చింది. అతడు రూ.3,099 డబ్బు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అయితే పార్సిల్‌పై ఎందుకో అనుమానం రావడంతో దాన్ని ఓపెన్ చేస్తూ వీడియో తీశాడు. చివరికి అందులో హార్డ్ డిస్క్ లేకపోవడంతో షాకయ్యాడు. అందులో పది రూపాయలవి రెండు బట్టల సబ్బులు ఉండటాన్ని చూసి దిమ్మ తిరిగింది. హార్డ్ డిస్క్‌కు బదులు సబ్బులు పంపించారని.. చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరారు. తమకు సంబంధంలేదని అమెజాన్ డెలివరీ బాయ్ చేతులెత్తేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా -
ఆన్లైన్ ఆర్డర్‌తో దోపిడీ : ఇద్దరు అరెస్ట్
రంగారెడ్డి: తప్పుడు చిరునామాతో ఆన్లైన్లో వస్తువులు ఆర్డర్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను శంషాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పుర వాసి సయ్యద్ అమానుల్లా అలియాస్ అజీం(27), రాజేంద్రనగర్ సులేమాన్ ప్రాంతానికి చెందిన బి.శీష్‌కుమార్(29) స్నేహితులు. శీష్‌కుమార్ గతంలో అమెజాన్ కంపెనీలో కొరియర్ బాయ్‌గా పని చేయగా.. అజీం చిరు వ్యాపారం చేస్తుంటాడు. నెలక్రితం అమెజాన్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన శీష్‌కుమార్.. స్నేహితుడితో కలసి దోపిడీకి పథకం వేశాడు. జనవరి 24న ఆన్లైన్లో అమెజాన్ కంపెనీకు ట్రిమ్మర్ ఆర్డర్ చేశారు. ఐఎంటీ కళాశాల విద్యార్థి రాకేష్ పేరుతో ఆర్డర్ చేసి వీరి సెల్ నంబరు ఇచ్చారు. జనవరి 26న కంపెనీకి చెందిన కొరియర్ బాయ్ ఫయీమ్ వీరి సెల్‌కు కాల్ చేసి కళాశాల వద్ద ఉన్నట్లు చెప్పాడు. దీంతో హమీదుల్లానగర్ సమీపంలో ఔటర్ రింగు రోడ్డు డెలివరీ బాయ్‌ను కలిశారు. అతడి వద్ద ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం తొండుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన అజీం, శీష్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద బైక్‌తో పాటు అమెజాన్ కంపెనీకి చెందిన బ్యాగులోని 23 ఆర్డరు బాక్స్‌లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించారు.