
నాలుగు కిలోల గంజాయి స్వాధీనం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం నుంచి వర్క్‌షాపునకు వెళ్లే దారిలో బద్వేలుకు చెందిన పుల్లగూర నారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.15వేలు విలువ జేసే నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ అధికారుల ఆదేశాల మేరకు గంజాయి మీద దృష్టి సారించామన్నారు. ఆ మేరకు తమకు వచ్చిన సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి. గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్సైజ్ ఎస్‌ఐ కిషోర్ కుమార్, హెడ్‌కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.