వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.
బద్వేలు: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం బ్యాంకు తెరిచేసరికి లోపల షార్టు సర్క్యూట్ జరిగి దట్టమైన పొగ అలుముకుంది. బ్యాంకు సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. నోట్ల మార్పిడి కోసం బయట క్యూలో ఉన్న ఖాతాదారులు కూడా భయంతో పరుగులు తీశారు. బ్యాంకు అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.