
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్‌లో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన శిరీష ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో శిరీష హత్యకు గురైన విషయం తెలిసిందే.
చదవండి: వైఎస్సార్ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది