Viral Video: Young Woman Beats Harasser In Vijayawada - Sakshi
Sakshi News home page

Vijayawada Viral Video: పోకిరిని చితకబాదిన యువతి.. హ్యాట్సాఫ్ అంటూ వాసిరెడ్డి పద్మ కామెంట్‌

Published Fri, Apr 29 2022 10:50 AM | Last Updated on Fri, Apr 29 2022 11:42 AM

Young Woman Beats Harasser In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఓ పోకిరికి యువతి తగిన బుద్ధి చెప్పింది. బైక్‌పై ఫాలో చేస్తూ ఇబ్బందికి గురిచేయడంతో ఆమె ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి.. దేహశుద్ధి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె.. సదరు పోకిరిని కర్రతో చితకబాదింది. ఈ ఘటనపై వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement