బద్వేల్ (అట్లూరు): తెలుగుదేశం పార్టీ పాల్పడుతున్న నీచరాజకీయాలు ఒక నిండు గర్భిణికి చేటు తెచ్చాయి. వివరాల్లోకి వెళ్లితే పోరుమామిళ్లకు చెందిన ఎంపీటీసీ డాక్టర్ గౌస్‌పీర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే తనమద్దతని తెలిపారు. అతనిని ఏలాగైనా లొంగదీసుకునేందుకు పన్నాగం పన్నిన టీడీపీ నాయకులు ఎంపీటీసీ కుమారుడు ముర్తుజా హుసేన్‌ను పోరుమామిళ్లలో ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ముర్తుజా హుసేన్ భార్య రేష్మా కాన్పు కోసం పుట్టిళ్లు దువ్వూరుకు వెళ్లింది. తనభర్త కిడ్నాప్ అయిన విషయం తెలిసి రెండు రోజులుగా తిండి తిప్పలు మానేసింది. ఆమె పడుతున్న వేదనను చూసి పోరుమామిళ్ల పట్టణ ప్రజలు తెలుగుదేశంపార్టీని,నాయకులను తూర్పారపడుతున్నారు. ఓటు కోసం ఇంత ఘతానికి దిగుతారా..? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.