వైఎస్సార్ జిల్లా బద్వేలులోని శివాలయం సమీపంలో నీటి కుంటలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు.
వైఎస్సార్ జిల్లా బద్వేలులోని శివాలయం సమీపంలో నీటి కుంటలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. మహబూబ్‌నగర్ కాలనీకి చెందిన ఆరిఫ్ (13) ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలసి శివాలయం సమీపంలోని నీటి కుంట దగ్గరకు వెళ్లాడు. ఈత కొట్టేందుకు లోపలికి దిగగా, లోతైన ప్రదేశంలో బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.