బద్వేలులో వరుస చోరీలు
Published Tue, Jan 12 2016 9:54 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో మంగళవారం వేకువజామున రెండిళ్లలో చోరీలు జరిగాయి. గాంధీనగర్‌లోని నర్సింహరాజు అనే బట్టల వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 5 తులాల బంగారు నగలు, వెండి వస్తువులు దోచుకెళ్లారు. అదే వీధిలో ఉన్న చిన్నపరెడ్డి సహదేవరెడ్డి ఇంట్లో కూడా దొంగలుపడి 3 వేల రూపాయల నగదు, ఒక ట్యాబ్ చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement