చెన్నకేశవస్వామి రథాన్ని లాగుతున్న భక్తులు
బద్వేలు అర్బన్ : చెన్నంపల్లె సమీపంలోని శ్రీదేవి, భూదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నెరవేరిం. ఉదయం నుంచే భక్తులు రథాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వేలాదిమంది భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవంలో ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం ముగిసిన అనంతరం భక్తుల దర్శనం కోసం స్వామివారిని రథంపై నుంచి కిందకు దించి గ్రామోత్సవం నిర్వహించారు.
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
ఆదిచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత పోటీలను మున్సిపల్ చైర్మన్ వీ.రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. సుమారు 6 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మొదటి బహుమతిని రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన కమ్ముసాహెబ్ రసూల్ ఎడ్లు కైవసం చేసుకోగా, వీరికి రూ.40,116ల నగదును బహుమతిగా అందజేశారు.
ద్వితీయ బహుమతిని కమలాపురం గ్రామానికి చెందిన చల్లా శివారెడ్డి వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.20,116ల బహుమతిని అందజేశారు. తృతీయ బహుమతిని గోపవరం మండలానికి చెందిన నెమలయ్య వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.10,116ల బహుమతిని అందించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రంగారెడ్డి, పోటీల నిర్వాహకులు నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment