
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి
స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొన్న సంఘటనలో పంగా రమణారెడ్డి (59) అనే వ్యక్తి మృతి చెందాడు.
బద్వేలు అర్బన్: స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొన్న సంఘటనలో పంగా రమణారెడ్డి (59) అనే వ్యక్తి మృతి చెందాడు. పంగావాండ్లపల్లెకు చెందిన రమణారెడ్డి కొన్నేళ్లుగా పట్టణంలోని సురేంద్రనగర్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం తన సొంత పనిమీద నాలుగురోడ్ల కూడలికి వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో బద్వేలు డిపోకు చెందిన ఏపీ04 టీడబ్ల్యు 0456 నంబరుగల అద్దెబస్సు అనంతపురం నుంచి బద్వేలుకు వస్తున్న సమయంలో రోడ్డుదాటుతున్న రమణారెడ్డిని ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. పట్టణ పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా మృతుడి భార్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు.