ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థిని బలి | women student suside with Raging | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 19 2016 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ర్యాగింగ్‌ భూతానికి జిల్లాకు విద్యార్థిని బలైంది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. మృతురాలు బద్వేలు మండలం పుట్టాయపల్లెవాసి కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బీరం జయరామిరెడ్డి, జయమ్మ దంపతుల రెండవ సంతానం బీరం ఉషారాణి (18) నంద్యాలలో ఉన్న ఆర్‌జీఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే కొంతకాలంగా సీనియర్‌ విద్యార్థులు ర్యాంగింగ్‌ పేరుతో ఇబ్బందులు పెడుతుండేవారని, ఈ విషయాన్ని 15 రోజుల క్రితం తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. వారంరోజుల క్రితం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఉషారాణిని గురువారం ఉదయం ఆమె తండ్రి కారులో కాలేజీకి తీసుకెళ్లి వదిలిపెట్టి కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందికి కూతురు పడుతున్న ఇబ్బందులను తెలియచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement