Badvel Assembly Constituency
-
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు