తిరుపతిలో గురువారం అర్థరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు.
తిరుపతి: తిరుపతిలో గురువారం అర్థరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. తాగి వాహనం నడుపుతున్న వారు... బైక్పై వెళ్తున్న టీటీడీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య దంపతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో వారు కింద పడటంలో... వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం తాగుబోతులు కారులో పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.... వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.