కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ వైపు నుంచి బైక్‌పై ఇద్దరు కర్నూలు వైపు వెళుతుండగా, ఓ గుర్తు తెలియని వాహనం కొత్తకోట బైపాస్ వద్ద ఢీకొంది. బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను 108 వాహనంలో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.