ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా..
దిలావర్‌పూర్(ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగింది.
వివరాలు.. సిరిగాపూర్‌కు చెందిన కదం బాలాజి(40) బీడీ కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సాపూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని నిర్మల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.