లావేరు: శ్రీకాకుళం జిల్లా లావేరు సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై సరుకులతో వస్తున్న టాటా వ్యాన్ మండలంలోని తాళ్లవలస గ్రామం వద్ద మలుపు తిరుగుతుండగా విశాఖ నుంచి వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల వివరాలు తెలియరాలేదు.