చిలకూరు: శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా చిలకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మండలంలోని ఇసుకపల్లికి చెందిన వెంకటకృష్ణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.