రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. రాయచోటికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు చిన్నమండెంలోని తమ మిత్రుడు సోహెల్ ఇంటికి గురువారం ఉదయం వెళ్లారు.
మధ్యాహ్నం తరువాత తిరుగు ప్రయాణంలో నలుగురూ ఒకే బైక్‌పై రాయచోటి వైపు వెళుతుండగా.. వారి బైక్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.