ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సమీపంలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రకాశం: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా వారు అత్యవసర ద్వారాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చైన్నైకు చెందిన ఎస్‌ఆర్‌ఎం ట్రావెల్స్ బస్సు స్లీపర్ కోచ్ హైదరాబాద్‌కు వెళుతోంది.
అదే సమయంలో గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన ఓ లారీ ఎదురుగా రాగా ఆ రెండూ సింగరకొండ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు విడవగా, లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ గోపాలంతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.