జమ్మలమడుగు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రూరల్ మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో కూలీ మృతిచెందాడు. వివరాలు...ఎస్. ఉప్పలపాడుకు చెందిన ఆరుగురు యువకులు ఎండుగడ్డి తెచ్చేందుకు ట్రాక్టర్‌లో వెళ్లి వస్తుండగా కర్నూలు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న కూలీ మధుసూదన్‌రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం తెలిసిన వెంటనే జమ్మలమడుగు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, మధుసూదన్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.