వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది.
నెల్లూరు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీపై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది.
బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వలస కూలీలతో వెళ్తున్న మినీ లారి జడదేవి సమీపంలోకి రాగనే అదుపుతప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.