lorry rolls
-
లారీ బోల్తా క్లీనర్ మృతి
యాడికి (తాడిపత్రి టౌన్) : యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్ మరణించగా, డ్రైవర్ గాయపడినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక నుంచి సిమెంట్ లోడుతో చెన్నై బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని వేములపాడు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్లీనర్ విశాల్(20) అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
లారీ బోల్తా: ఒకరి మృతి
నెల్లూరు: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీపై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వలస కూలీలతో వెళ్తున్న మినీ లారి జడదేవి సమీపంలోకి రాగనే అదుపుతప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి లారీ బోల్తా.. ఇద్దరి మృతి
మరో 32 మందికి గాయాలు చింతపల్లి: పెళ్లి లారీ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. తక్కెళ్లపల్లి పంచాయతీ పరిధిలోని రోటిగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ నరేష్‌కు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి తండాకు చెందిన అనుజతో బుధవారం ముష్టిపల్లిలో పెళ్లి జరగనుంది. ఆ వేడుకకు వెళ్లేందుకు పెళ్లికుమారుడి బంధువులు తక్కెళ్లపల్లి నుంచి లారీలో బయలుదేరారు. వేగంతో వెళ్తున్న లారీ.. గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో అందులో ఉన్న నేనావత్ బాష (62), నేనావత్ చావిలి (65) అక్కడికక్కడే మృతిచెందగా మరో 32 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.