నగరంలోని ఉప్పల్-నాగోల్ మార్గంలో హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కారు సర్వీసింగ్ కోసం శనివారం ఉప్పల్ వచ్చారు. సర్వీసింగ్ పూర్తయ్యాక తిరిగి వెళ్తుండగా ఉప్పల్ మెట్రో వద్ద వీరి కారును వెనుకనుంచి లారీ ఢీకొంది. ఐదుగురు తీవ్రంగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.