తిరుమలాయపాలెం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని పిండిప్రోలు సమీపంలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ కోళ్ల లోడుతో కృష్ణా జిల్లా నందిగామ వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కోళ్ల లోడ్ లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది కృష్ణా జిల్లా నందిగామగా పోలీసులు నిర్ధరించారు. గాయపడిన వారు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.`