వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండల కేంద్రం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (25) ఓ బాలికతో కలసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న బాలికకు గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.