koteswARARAO
-
ప్రేమ, పెళ్లి అంటూ...మోసం
► ప్రియురాలి ఇంట్లో ఉండగా ప్రియుడిని నిర్బంధించిన కుటుంబ సభ్యులు ► ఇంటికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు ప్రేమించానని నమ్మించాడు...పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మబలికాడు. శారీరక సంబంధం కొనసాగిస్తూ ఆమెను మోసం చేయాలని చూశాడు. దీంతో మోసపోతున్నానని గుర్తించిన ప్రియురాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించింది. ఇదిగో...అదిగో...అన్నాడే తప్ప వివాహానికి అంగీకారం తెలపలేదు. దీంతో ప్రియురాలి అక్కబావలు విషయం గుర్తించి ప్రియురాలితో ప్రియుడు కలిసి ఉండగా ఇంటికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... గంట్యాడ(గజపతినగరం): కొండతామరాపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి రాధ విజయనగరం ఎంఆర్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది. రాధకు తొమ్మిది నెలల కిందట జామి మండలం భీమసింగి గ్రామానికి చెందిన బోడసింగి కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో కోటేశ్వరరావు తరచూ రాధ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. నిన్ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని రాధను నమ్మించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడి కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం కాస్త రాధ అక్క, బావలకు తెలిసింది. దీంతో రాధను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని కోటేశ్వరరావును ప్రశ్నించారు. తమ కుటుంబ పెద్దలకు విషయం చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తప్పించుకునేవాడు. కచ్చితంగా ఏ విషయం చెప్పే వాడు కాదు. దీంతో బుధవారం రాత్రి తామరాపల్లిలోని రాధ ఇంటికి వచ్చిన కోటేశ్వరరావును మరోసారి అడగ్గా సమాధానం దాటవేశాడు. గురువారం కూడా కోటేశ్వరరావు రాధతో ఇంట్లో ఉండగా అక్కబావలు ఇంటి గ్రిల్స్‌కు తాళం వేసి నిర్బంధించారు. అనంతరం గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాధకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన పోలీసులు కొండతామరాపల్లి వెళ్లి గృహ నిర్బంధంలో ఉన్న ప్రేమికులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. -
కష్టపడితే ఉన్నతంగా ఎదగొచ్చు
ఏలూరు (సెంట్రల్) : కష్టపడి పనిచేస్తే అత్యున్నతస్థాయికి వెళ్లడం కష్టంకాదని బాబూ జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ ప్రపంచానికి చాటి చెప్పారని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ 110వ జయంతి సందర్భంగా స్థానిక 38వ డివిజన్ లంకపేటలో ఆయన విగ్రహానికి కోటేశ్వరరావు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ నూర్జహాన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంకోసం నాటి నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని, అందువల్లే ప్రపంచ దేశాలలో మనదేశం నేడు అగ్రరాజ్యానికి దీటుగా నిలబడిందని అన్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడివాడ రామ చంద్రకిషోర్, కమిషనర్ వై.సాయి శ్రీకాంత్, కార్పొరేటర్లు నిర్మలకమారి, రాయి విమలదేవి, జిజ్జువరపు ప్రతాప్‌కుమార్, దళిత సంఘం నాయకులు మున్నుల జాన్ గురునా«థ్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి దౌర్జన్యం చేసినా పట్టదా?
ఒక సర్పంచి.. తనకు నచ్చిన పని చేసినందుకు అతడిని భయభ్రాంతులకు గురిచేసేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు దౌర్జన్యం చేసినా రాజధాని ప్రాంతంలో ఉన్న పోలీసులకు పట్టదా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణాజిల్లా విజయవాడ శివారులోని నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును కొంతమంది గుర్తుతెలియని దుండగులు తగలబెట్టడమే కాక.. ఆయన కార్యాలయానికి తాళం వేసి, పంచాయతీ ఆఫీసులోకి సర్పంచిని వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. తగలబడిన కారును పరిశీలించిన అనంతరం సర్పంచ్ కోటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''విజయవాడలో రకరకాలుగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. అదే రాజధానిలో ఒక సర్పంచ్ వాళ్లకు నచ్చినట్లుగా ఉండకపోతే ఆ సర్పంచ్ కారును తగలబెట్టే పరిస్థితిలోకి తీసుకుపోవడం, ఆయన కార్యాలయాన్ని మూసేయడం ఎంతవరకు ధర్మమని అడుగుతున్నా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయినా పోలీసుల దగ్గరకుపోతే వెంటనే వాళ్లు పెట్టాల్సిన కేసులు పెట్టరు, అరెస్టులు జరగవు. సర్పంచ్‌ని భయపెట్టేలా అర్ధరాత్రి వచ్చి దుండగులు కారు తగలబెట్టేసి, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తున్నారు. పట్టపగలే కార్యాలయాన్ని మూసేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు బి-ఫారంల ప్రకారం జరగవు. అవి రాజకీయాలకు అతీతం. అందరూ మద్దతిస్తేనే సర్పంచ్‌గా ఎన్నికవుతారు. అయినా ఇప్పుడు మాత్రం అంతా అధికార పార్టీ వాళ్లకు నచ్చిన ప్రకారమే జరగాలి, ఎవరైనా అభ్యంతరం చెబితే బెదిరించడం, పంచాయతీ కార్యాలయాన్ని కూడా మూసేసి తాళాలు వేస్తున్నారంటే అర్థం ఏముంది? నా ఆఫీసు తాళం నేను తెరుచుకోవాలంటే గొడవ పడాల్సి వస్తోందంటే ఎలా? పట్టపగలు రాజధాని ప్రాంతంలో 10వేల ఓట్లున్న మేజర్ పంచాయతీలో పట్టపగలు బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రభుత్వం బీసీలకు అండగా ఉన్నట్లు ఎలా చెప్పుకోగలదు? నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తే న్యాయం చేసినట్లు కాదు. నాన్నగారి కాలంలో వాళ్ల పిల్లలు చదువుకోవాలి, అందుకు అప్పులపాలు కాకూడదని ఆ పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చేసే కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు వచ్చారు, మళ్లీ కథ మొదటికి వచ్చేసింది. వాళ్లు ఇచ్చేది 35 వేలు, ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. అంతటితో ఆగిపోలేదు.. నచ్చని సర్పంచుల మీద దాడులు, కార్లు తగలబెట్టడం, పోలీసుల వద్దకు వెళ్తే నిందితులపై కేసులు పెట్టకపోవడం .. ఇవన్నీ చేస్తున్నారు. కేవలం రెచ్చగొట్టాలనే కార్యాలయానికి తాళం వేస్తున్నారు. రాజధానిలో పోలీసులను వాడుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి 900 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే పద్ధతి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నాం. ఇక రెండేళ్లే ఉంది.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు, ప్రజలు ఆయనను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్లను రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేస్తే కొద్దోగొప్పో చర్యలు తీసుకున్నారని ప్రజలకు తెలుస్తుంది. ఏదో తూతూ మంత్రం వ్యవహారం చేస్తే మాత్రం చంద్రబాబు త్వరలోనే బంగాళాఖాతంలో కలిసిపోతారు. బీసీల వల్లే గెలిచానని చెప్పుకొన్నారు. వాళ్లు తిరగబడితే ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది'' అని ఆయన చెప్పారు. -
అర్ధరాత్రి దౌర్జన్యం చేసినా పట్టదా?
-
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి
విశాఖపట్టణం: ఇంటి నంబరు కేటాయించేందుకు లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ నగరం కంచరపాలేనికి చెందిన వెంకట బాలసూర్యప్రకాశ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి నంబరు కేటాయించాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టర్ జి.కోటేశ్వరరావు రూ.6,500 డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల క్రితం సూర్యప్రకాశ్ రూ.4 వేలు ఇచ్చారు. మిగతా రూ.2,500 ఇచ్చే క్రమంలో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం సాయంత్రం కోటేశ్వరరావుకు ఆయన కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని అధికారులు వలపన్ని పట్టుకున్నారు. -
లారీ, బైక్ ఢీ: ఒకరి మృతి
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండల కేంద్రం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (25) ఓ బాలికతో కలసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న బాలికకు గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి
ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి ూర్టూరు, ఇటుక మీద ఇటుక పేర్చి..మధ్యలో సిమెంట్ కూర్చి ఇంటిని నిర్మించే బేల్దారీ.. తన కుమారుడి బతుకునూ మార్చుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడదని తెలిసినా కుమారుడిని చదివించడం కోసం వెనుకాడలేదు. ఫలితంగా తన కుటుంబం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంగా ప్రత్యేక స్థానాన్ని అధిరోహించింది. మార్టూరులోని శాంతినగర్ కాలనీకి చెందిన తన్నీరు వీరాంజనేయులు బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. తన కుమారుడు నాగరాజును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చూడాలనేది అతని కోరిక. నాగరాజు మేనమామ కుంచాల కోటేశ్వరరావు కూడా మేనల్లుడి చదువుకు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. దీంతో తన్నీరు నాగరాజు నల్గొండ జిల్లా కోదాడ సనా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ దూర విద్య ద్వారా అభ్యసించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఒంగోలులోని వివేకానంద కోచింగ్ సెంటర్లో గ్రూప్-2కోచింగ్ తీసుకున్నారు. ఇంతలో వీఆర్ఏ పరీక్షలో 94 మార్కులు, వీఆర్ఓ పరీక్షలో 96 మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గ్రూప్-1 సాధించటమే లక్ష్యమని నాగరాజు తెలిపారు.