ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
బాలానగర్ (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఐడీపీఎల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... జగద్గిరిగుట్టకు చెందిన కెవెన్‌కుమార్ (19) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
పనిమీద బాలానగర్ వచ్చి గుట్టకు తిరిగి వెళ్తుండగా ఐడీపీఎల్ కాలనీ యూటర్న్‌లో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.