రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
డిచ్‌పల్లి(నిజామాబాద్): రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బి.ధర్మారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఏసోబు(55) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయనను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.