ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఒకరు మృతి | one dies in road accident in keesara | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఒకరు మృతి

Published Wed, Jun 17 2015 3:56 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

one dies in road accident in keesara

రంగారెడ్డి : ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సురేష్(30), శంకర్‌లు లారీ డ్రైవర్లు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నాగారం శివాలయం వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement