కర్నూలు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలిమగుండ్ల మండలం కనకాద్రిపల్లి వద్ద బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీవీఎస్ ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న బాబావలీ(38) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతను అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.