విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా కసీంకోట మండలంలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కురగాయల వ్యాపారులు ఆటోలో అమలాపురం మార్కెట్ వెళుతుండగా వెనకు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ గొల్లపల్లి ఈశ్వరరావు(38) అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. బాధితులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.