చిత్తూరు రూరల్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు రూరల్ మండలం కమ్మపల్లి గ్రామం వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని గుత్తుకూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి(32) బోరు బావులలో పైపులు దింపే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ రోజు (శనివారం) చిత్తూరు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంగా నడిపి వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడని ఆగ్రహించిని స్థానికులు, ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.