ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలోని కామినేని ఆస్పత్రి వద్ద శనివారం ఉదయం జరిగింది
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలోని కామినేని ఆస్పత్రి వద్ద శనివారం ఉదయం జరిగింది. కామినేని ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.