కమలాపురం(కరీంనగర్): కమలాపురం మండలం శ్రీరాములపల్లి శివారులో గురువారం టాటా ఏస్ వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.