పట్టపగలే కత్తులతో దాడి చేశారు.
చిత్తూరు: పట్టపగలే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులపై ఎవరో దుండగులే కత్తులతో దాడి చేశారు.
ఎవరో తెలీదు.. ఎందుకో తెలీదు.. దాడి మాత్రం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని వైద్యం కోసం.. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు.