నెల్లిమర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని సత్తెవాడ గ్రామ సమీపంలోని రెండు బైకులు ఒక దానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మీసాల సాయి (15) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.