రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చెట్టుకూలి కారుపై పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. వికారాబాద్‌కు చెందిన కొందరు కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా కేసారం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు అకస్మాత్తుగా కూలి పడింది. కారు ముందుభాగంలో పడటంతో ముందు సీట్లో కూర్చున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న వారిని అతికష్టంపై బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుపై చెట్టు పడటంతో ఆ మార్గంలో రాకపోకలు గంటపాటు ఆగిపోయాయి. పోలీసులు చెట్టును నరికించి, రాకపోకలను పునరుద్ధరించారు.