అనంతపురం సెంట్రల్ : స్థానిక బళ్లారి బైపాస్‌రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సందీప్(25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలో స్టాలిన్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసులు కుమారుడు సందీప్ బీటెక్ వరకూ చదువుకున్నాడు. గొల్లపల్లి సమీపంలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో అక్కడి నుంచి కుటుంబ సభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
Published Wed, Nov 23 2016 11:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement