స్విమ్మింగ్‌పూల్‌లో పడి వ్యక్తి మృతి | one dies after fall into swimmingpool in Neni Hitech Club in New Bowenpally | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌పూల్‌లో పడి వ్యక్తి మృతి

Published Sun, Apr 5 2015 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

one dies after fall into swimmingpool in Neni Hitech Club in New Bowenpally

హైదరాబాద్: ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఒక వ్యక్తి స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నగరంలోని బోయినపల్లిలో జరిగింది. వివరాలు..గౌతమ్‌నగర్‌కు చెందిన అమ్‌జద్(29) స్థానిక నెనీ హైటెక్ క్లబ్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు.

అయితే, నిర్వాహకుల నిర్లక్ష్యంతో మొదటి రోజు ఈత నేర్చుకోవడానికి వెళ్లిన వ్యక్తి అందులో పడి మృతి చెందాడు. దీంతో నిర్వాహకులు పరారయ్యే ప్రయత్నం చేశారు. వారిని స్థానికులు పట్టుకోని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement