swimmingpool
-
వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం నుంచి పంత్ త్వరగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్ షేర్ చేసిన వీడియో చూస్తుంటే అతను గాయాల నుంచి చాలా వరకు కోలుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పంత్ స్విమ్మింగ్ పూల్‌లో నడుస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. పూల్‌లోనే చేతి కర్ర సాయంతో అటూ ఇటూ నడిచాడు. కాళ్లపై బలాన్ని పెట్టేందుకే పూల్‌లో నడిచినట్లు అర్థమవుతుంది. "చిన్న విషయాలు, పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నింటికీ నేను రుణపడి ఉన్నాను. వీటన్నింటిని ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా" అంటూ క్యాప్షన్ జత చేశాడు. గాయం తర్వాత పంత్ మోకాలికి కూడా సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. గతంలో ఆరుబయట నడుస్తున్న ఫొటోను షేర్ చేసిన పంత్.. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో నడుస్తూ తన కాళ్లలో బలాన్ని మరింత పెంచుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తూ కారు ప్రమాదంలో తీవ్రం గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనికి ముంబైలో రెండు సర్జరీలు జరిగాయి.అప్పటి నుంచి తన పరిస్థితిని వివరిస్తూ ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. ఈ మధ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎస్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ '#Rest In Peace.. పాకిస్తాన్ క్రికెట్' -
IPL 2021: స్విమ్మింగ్‌ఫూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల జల్సా..
DC Players Have Fun Pool Session.. ఐపీఎల్ 2021లో కేకేఆర్‌తో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా గడిపారు. కెప్టెన్ రిషబ్ పంత్, శిఖర్ ధవన్, అక్షర్ పటేల్, మరికొంతమంది డీసీ ఆటగాళ్లు స్విమ్మింగ్‌ఫూల్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ దశలో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే క్వాలిఫయర్ 1లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అయితే క్వాలిఫయర్ 2 ద్వారా ఫైనల్ చేరే అవకాశం ఉండడంతో కేకేఆర్‌తో మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోనుంది. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా View this post on Instagram A post shared by Delhi Capitals (@delhicapitals) -
‘స్విమ్మింగ్‌పూల్’లో అవినీతి చేపలు..?
అడ్మిషన్ల ఆదాయాన్ని పంచుకున్న సిబ్బంది చర్యలపై డీఎస్డీఓ మీనమేషాలు ‘సాట్’ దృష్టికి వెళ్లినట్లు సమాచారం! వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కి ప్రధాన ఆదాయ వనరైన స్విమ్మింగ్ పూల్‌లో అవినీతి చేపలు తిష్ట వేశాయి. అయితే అవినీతి చేపలను స్వయంగా డీఎస్ఏ ఉన్నతాధికారులే పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కనుసన్నలలో యథేచ్ఛగా కొనసాగుతుండడం తో ఆ చేపల అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఆదాయ వివరాలను పొందుపరచడంలో లొసుగులను ఆసరా చేసుకున్న అవినీతి చేపలు పెద్ద మొత్తంలో వెనుకేసినట్లు సమాచారం. సమకూరిన అవినీతి సొమ్మును తలా ఇంతా పంచుకుతింటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. డీఎస్ఏ ఆధ్వర్యంలో.. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో బాలసముద్రంలో స్విమ్మింగ్‌పూల్ కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినది కావడంతో స్విమ్మింగ్‌పూల్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహణతో పాటు ప్రతిరోజు నగరంలోని సుమారు 200 మంది స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ సంఖ్య వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో త్రిబుల్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అడ్మిషన్‌తో పాటు నెలనెలా ఫీజు డీఎస్ఏ స్విమ్మింగ్‌పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేందుకు అడ్మిషన్ తీసుకోవా లి. అందుకు ప్రతి వ్యక్తి నుంచి రూ. 1500ల అడ్మిషన్ ఫీజును డీఎస్ఏ వసూ లు చేస్తోంది. ఇక ప్రతినెల రూ.600 రూ పాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అడ్మిషన్ ఫాం రూ.100 వె చ్చించి కొనుగోలు చేయాలి. రెగ్యులర్ కాకుండా కేవలం వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు, వేసవి సెలవుల్లో పిల్లలకు ఈత నేర్పించేందుకు మరికొందరు స్విమ్మింగ్‌పూల్ బాటపడుతుంటారు. రెండు నెలల పాటు కిక్కిరిసిపోయే స్విమ్మింగ్‌పూల్‌లో ఒక దశలో అడ్మిషన్ల కోసం పైరవీలు చేయాల్సి వ స్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వేసవిలో డిమాండ్ వేసవి డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న సదరు పూల్ సిబ్బంది అడ్మిషన్ల ఆదాయాన్ని పక్కదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో పదిలక్షల రూపాయలను డీఎస్ఏ అకౌంట్లో జమచేసినట్లు సిబ్బంది చెబుతుండగా, ఆ ఆదాయం గత ఏడాదితో పోల్చితే చాలా తక్కువని, సంఖ్య పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 200 ఉన్న సంఖ్య ఏప్రిల్, మే నెలలో 800ల నుంచి 1000 మంది వరకు పెరిగినట్లు తెలిసింది. అడ్మిషన్ పత్రాలు మాయం అడ్మిషన్ల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేస్తుంటారు. అయితే వేసవిలో నమోదైన అడ్మిషన్లలో 110 పత్రాలు మాయమైనట్లు సమాచారం. ఒక్కో అడ్మిషన్‌కు రూ.1500, నెల ఫీజు 600, అడ్మిషన్ ఫాం 100 రూపాయలు ఈ లెక్కన రూ.2.42 లక్షల ఆదాయాన్ని పూల్‌లో పనిచేసే ముగ్గురు కాంట్రాక్టు సిబ్బంది పంచుకున్నట్లు తెలుస్తోంది. నా దృష్టికి రాలేదు స్విమ్మింగ్‌పూల్‌లో అడ్మిషన్లు మిస్సైన విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. గత ఏడాది జిల్లాలో జరిగిన పైకా క్రీడల వివరాలను కేంద్రానికి అత్యవసరంగా పంపించాల్సి ఉంది. ఆ పని పూర్తయ్యాక పూల్ అకౌంట్స్ పరిశీలిస్తా. అక్రమాలకు జరిగినట్లు తేలితే బాధ్యులపై తప్పవు. – ఇందిర, డీఎస్డీఓ -
స్విమ్మింగ్‌పూల్‌లో పడి వ్యక్తి మృతి
హైదరాబాద్: ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఒక వ్యక్తి స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం నగరంలోని బోయినపల్లిలో జరిగింది. వివరాలు..గౌతమ్నగర్కు చెందిన అమ్జద్(29) స్థానిక నెనీ హైటెక్ క్లబ్లో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు. అయితే, నిర్వాహకుల నిర్లక్ష్యంతో మొదటి రోజు ఈత నేర్చుకోవడానికి వెళ్లిన వ్యక్తి అందులో పడి మృతి చెందాడు. దీంతో నిర్వాహకులు పరారయ్యే ప్రయత్నం చేశారు. వారిని స్థానికులు పట్టుకోని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.