‘స్విమ్మింగ్‌పూల్’లో అవినీతి చేపలు..?
‘స్విమ్మింగ్‌పూల్’లో అవినీతి చేపలు..?
Published Sun, Aug 21 2016 11:33 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
అడ్మిషన్ల ఆదాయాన్ని పంచుకున్న సిబ్బంది
చర్యలపై డీఎస్‌డీఓ మీనమేషాలు
‘సాట్’ దృష్టికి వెళ్లినట్లు సమాచారం!
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కి ప్రధాన ఆదాయ వనరైన స్విమ్మింగ్ పూల్‌లో అవినీతి చేపలు తిష్ట వేశాయి. అయితే అవినీతి చేపలను స్వయంగా డీఎస్‌ఏ ఉన్నతాధికారులే పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కనుసన్నలలో యథేచ్ఛగా కొనసాగుతుండడం తో ఆ చేపల అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఆదాయ వివరాలను పొందుపరచడంలో లొసుగులను ఆసరా చేసుకున్న అవినీతి చేపలు పెద్ద మొత్తంలో వెనుకేసినట్లు సమాచారం. సమకూరిన అవినీతి సొమ్మును తలా ఇంతా పంచుకుతింటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
డీఎస్‌ఏ ఆధ్వర్యంలో..
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో బాలసముద్రంలో స్విమ్మింగ్‌పూల్ కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినది కావడంతో స్విమ్మింగ్‌పూల్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహణతో పాటు ప్రతిరోజు నగరంలోని సుమారు 200 మంది స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ సంఖ్య వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో త్రిబుల్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
అడ్మిషన్‌తో పాటు నెలనెలా ఫీజు
డీఎస్‌ఏ స్విమ్మింగ్‌పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేందుకు అడ్మిషన్ తీసుకోవా లి. అందుకు ప్రతి వ్యక్తి నుంచి రూ. 1500ల అడ్మిషన్ ఫీజును డీఎస్‌ఏ వసూ లు చేస్తోంది. ఇక ప్రతినెల రూ.600 రూ పాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అడ్మిషన్ ఫాం రూ.100 వె చ్చించి కొనుగోలు చేయాలి. రెగ్యులర్ కాకుండా కేవలం వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు, వేసవి సెలవుల్లో పిల్లలకు ఈత నేర్పించేందుకు మరికొందరు స్విమ్మింగ్‌పూల్ బాటపడుతుంటారు. రెండు నెలల పాటు కిక్కిరిసిపోయే స్విమ్మింగ్‌పూల్‌లో ఒక దశలో అడ్మిషన్ల కోసం పైరవీలు చేయాల్సి వ స్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వేసవిలో డిమాండ్
వేసవి డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న సదరు పూల్ సిబ్బంది అడ్మిషన్ల ఆదాయాన్ని పక్కదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో పదిలక్షల రూపాయలను డీఎస్‌ఏ అకౌంట్‌లో జమచేసినట్లు సిబ్బంది చెబుతుండగా, ఆ ఆదాయం గత ఏడాదితో పోల్చితే చాలా తక్కువని, సంఖ్య పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 200 ఉన్న సంఖ్య ఏప్రిల్, మే నెలలో 800ల నుంచి 1000 మంది వరకు పెరిగినట్లు తెలిసింది.
అడ్మిషన్ పత్రాలు మాయం
అడ్మిషన్ల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేస్తుంటారు. అయితే వేసవిలో నమోదైన అడ్మిషన్లలో 110 పత్రాలు మాయమైనట్లు సమాచారం. ఒక్కో అడ్మిషన్‌కు రూ.1500, నెల ఫీజు 600, అడ్మిషన్ ఫాం 100 రూపాయలు ఈ లెక్కన రూ.2.42 లక్షల ఆదాయాన్ని పూల్‌లో పనిచేసే ముగ్గురు కాంట్రాక్టు సిబ్బంది పంచుకున్నట్లు తెలుస్తోంది.
నా దృష్టికి రాలేదు
స్విమ్మింగ్‌పూల్‌లో అడ్మిషన్లు మిస్సైన విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. గత ఏడాది జిల్లాలో జరిగిన పైకా క్రీడల వివరాలను కేంద్రానికి అత్యవసరంగా పంపించాల్సి ఉంది. ఆ పని పూర్తయ్యాక పూల్ అకౌంట్స్ పరిశీలిస్తా. అక్రమాలకు జరిగినట్లు తేలితే బాధ్యులపై తప్పవు.
– ఇందిర, డీఎస్‌డీఓ
Advertisement