రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.