నాయుడుపేట(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక అగ్రహారపేట నివాసి మైలారు శంకరయ్య(38) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.