పల్లిపురం(నెల్లూరు): విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సెక్యూరిటీ గార్డు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పల్లిపురం మడలం పెండేపల్లి సమీపంలోని 71వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామానికి చెందిన రవి(40) నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి బైక్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు.