హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న డీసీఎం ముందు ఐరన్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
ఔటర్‌పై ప్రమాదం: ఒకరు మృతి
Published Sat, Apr 23 2016 8:22 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement