ఆర్‌టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
మెదక్: ఆర్‌టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన దిగ్వాల్ గ్రామంలో జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... సోలాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లుతున్న సిద్దిపేట 2 డిపోకు చెందిన బస్సును హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్లుతున్న లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన సుల్తార్ అహెమద్ (45)కు లారీలో ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఏరియా ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చంద్రశేఖర్ వివరించారు.