
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరి మృతి
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాయచోటి మండలం శిబ్యాల సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాదర్‌సాబ్(70) అనే వృద్ధుడు మృతిచెందగా..పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా సుండుపల్లి మండలం బేస్తపల్లికి చెందినవారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.